Electronics and Communication Engineering(ECE): ఎలక్ట్రానిక్స్ బేస్‌తో ఐటీ రంగంలో కెరీర్ అవకాశాలు! 10 month ago
B.tech (ECE) :
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు యూజీ స్ధాయిలో ఇంజినీరింగ్ కోర్సులోనే చేరుతున్నారు. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ ఈ విద్యను ప్రోత్సహిస్తున్నారు. అలాగే బీటెక్‌లో (B.tech) ఎక్కువ మంది ఎంపిక చేసుకునే బ్రాంచ్ CSE. దీని తర్వాత ఎక్కువ మంది విద్యార్ధులు ఆసక్తి చూపించే బ్రాంచ్ ఈసీఈ (ECE) బ్రాంచ్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ECE) బ్రాంచ్ నైపుణ్యాలతో కోర్ సెక్టార్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ ఉద్యోగాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ECE బ్రాంచ్ వల్ల ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇంజనీరింగ్‌లో ఈ బ్రాంచ్ ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎలక్ట్రానిక్ వస్తువు లేకుండా బయటికి వెళ్లలేని పరిస్ధితి ఉంది. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్, సమాచారం ఒక భాగంగా మారపోయింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఇలాంటి ఎన్నో మార్పులకు మూలం......ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్ధలు. వీటిని లోతుగా అధ్యయనం చేసే బ్రాంచ్..ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE). ప్రస్తుతం విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ECE ఒకటి. ECE పూర్తి చేసిన అభ్యర్ధులు ఇటు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్ధలతోపాటు అటు ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.
టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో.......
ఆధునిక సాంకేతిక విధానాలు.....నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం సంస్ధలు అన్వేషిస్తుండటం వంటివి ECE విద్యార్ధులకు వరంగా మారుతున్నాయి. ECE బ్రాంచ్‌తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అసెంచర్, సామ్‌సంగ్, వంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మరోవైపు బీహెచ్ఈఎల్, ఎన్‌టీపీసీ, ఇస్రో, డీఆర్‌డీవో, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లోనూ కొలువులు సొంతం చేసుకోవచ్చు. రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతూ...కొత్త టెక్నాలజీలు ఆవిష్కరిస్తుండటంతో విద్యార్ధులు ఈసీఈని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకుంటున్నారు.
విద్యార్హత:
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్‌డ్ లో ర్యాంక్ వస్తే NITs లో సీటు వస్తుంది. ఏపీ/తెలంగాణలో అయితే ఏపీఈఏపీసెట్, టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి మీరు ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వడానికి సీట్స్ పొందవచ్చు.
ఉన్నతవిద్య:
B.tech ECE పూర్తి చేసిన విద్యార్ధులు ఉన్నత చదువులు, పరిశోధనల వైపు ఆసక్తి ఉంటే..గేట్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్ధల్లో ఎంటెక్/ ఎంఈ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు పొందవచ్చు. విదేశాల్లో మాస్టర్స్ చేయాలనుకున్న అభ్యర్ధులు జీఆర్ఈ, టోఫెల్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా అంతర్జాతీయ విద్యాసంస్ధల్లో అడ్మిషన్ లభిస్తుంది.
ఈసీఈతో (ECE) అభ్యర్దులు...కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్ధల్లో, మొబైల్ కమ్యూనికేషన్, టెలి కమ్యూనికేషన్ అండ్ ఐటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, ఏరోనాటికల్, మిలటరీ తదితరరంగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇంటెల్, మోటరోలా, ఇస్రో, బీహెచ్ ఈఎల్, క్యాప్ జెమిని, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో కూడా అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ECE అభ్యర్ధులు..కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో, మొబైల్ కమ్యూనికేషన్, టెలి కమ్యూనికేషన్ అండ్ ఐటీ, ఇంటర్నెట్ టెక్నాలజీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, ఏరోనాటికల్, మిలటరీ తదితరరంగాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అంతేకాకుండా ఇంటెల్, మోటరోలా, ఇస్రో, బీహెచ్ ఈఎల్, క్యాప్ జెమిని, ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో కూడా అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, చక్కని ప్రణాళిక రూపొందించుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని ఆచరించడం.... విద్యార్ధుల విజయంలో ఎంతో కీలకం. నాలుగేళ్లు పూర్తయ్యేసరికి సబ్జెక్టులో పట్టు, నైపుణ్యాలతో ముందుకు దూసుకుపోవాలి. బీటెక్ విద్యార్హతతో చాలామంది 3,6,10,12....లక్షల వార్షిక ప్యాకేజీలతో కాలేజీ నుంచి క్యాంపస్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పది, పన్నెండు వేల నెల జీతంతో నెట్టుకొస్తున్నవాళ్ల సంఖ్యా తక్కువ కాదు. ఎక్కువ ప్యాకేజీతో అవకాశం వచ్చినవాళ్లు మరింత ముందుకెళ్తున్నారు. తక్కువ వేతనం పొందుతున్నవారు మెరుగైన స్ధాయిని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకింత వ్యత్యాసం?
ఆ నాలుగేళ్లూ బాగా చదివుంటే ఈ రోజు ఈ పరిస్ధితి ఉండేది కాదని... తక్కువ జీతంతో నెట్టుకొస్తున్నవాళ్లంతా మధనపడుతుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే వీరంతా నేటి విద్యార్ధులకు ఒక కేస్ స్టడీలాంటివారు. తమ కెరియర్ ఇలా ఉండకూడదని భావిస్తే ప్రథమ సంవత్సరం నుంచే తమ ప్రయాణాన్ని మెరుగైన రీతిలో మొదలుపెట్టి కొనసాగించాలి. లేదంటే రాజీపడుతూ, అసంతృప్తితో కెరియర్ కొనసాగుతుంది.
ఇది చదవండి: B.tech(EEE)తో భవిష్యత్‌కు భరోసా..